తెరాస ప్రభుత్వంలో శాసన సభ సమావేశాల నిర్వాహణకు తేదీలు ఖరారు కావండంతో క్యాబినెట్ విస్తరణపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొనసాగుతోంది. మొత్తం రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం కేసీఆర్ సూత్ర ప్రాయంగా వెల్లడించారు. దీంతో తొలి విడతలో ఎనిమిది మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో కేటీఆర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రెడ్యానాయక్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, రేఖానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్, తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
జనవరి 19న గవర్నర్ శాసన సభను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో సభలో మంత్రులు తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సమయంలోనూ మంత్రులు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు జనవరి 18 అనుకూలమని సీఎం భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే
ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ పేరును ఖరారు చేశారు.
దీంతో జనవరి 16న సాయంత్రం ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగనుంది. తెరాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇతర కార్యక్రమాల్లో పనుల వేగం మరింత పెంచే దిశగా తెరాస అధినేత మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది.