టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం…!

-

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నామినేషన్ కోసం భారీ ఏర్పాట్లు చేసారు. ఈ నేపధ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ కారు ప్రమాదంలో ఆయన వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.

కవిత వెనుక భారీ కాన్వాయ్ వస్తుండగా అందులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారు కూడా ఉండగా… కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద జీవన్ రెడ్డి కారును మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ కారు ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ ప్రమాదం నుంచి వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే మరో కారులో వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పార్టీ మారడంతో ఆయన స్థానంలో కవిత పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల నుంచి ఆమె ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. ఈ పదవిలో కవిత రెండేళ్ళ పాటు కొనసాగుతారు. ఆమెను కేబినేట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేబినేట్ లో ఖాళీ లేదు. మరి ఎలా తీసుకుంటారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version