కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ట్రాన్స్‌ఫోర్ట్ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో భారీ ఫైన్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరిమానాలు విధిస్తుంటారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లో లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటోంది. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ వేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.
ఇకపై ఈ డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు తప్పవని సర్కార్ హెచ్చరించింది. వాణిజ్య వాహనాలు, లారీలు నడిపే డ్రైవర్లు ఫుల్ సైజు ప్యాంటు షర్టు యూనిఫాంతో పాటు షూ తప్పనిసరిగా ధరించాలని కొత్త మోటారు వాహనాల చట్టం నిర్దేశించింది. అలాగే నిబంధనలు ప్రకారం అన్ని పాఠశాల వాహనాల డ్రైవర్లు కూడా ఈ రూల్ పాటించాల్సి ఉందని తెలిపారు. డ్రెస్ కోడ్ డ్రైవర్లు ఉల్లంఘిస్తే 1989 మోటారు వాహనాల చట్టం ప్రకారం 500 రూపాయల జరిమానం ప్రవేశపెట్టింది.
ప్రస్తుత కొత్త చట్టం 2019 ఎంవీ యాక్ట్ ప్రకారం డ్రైవర్లు లుంగీ ధరించి డ్రైవింగ్ చేస్తే రూ. 2000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కొత్త మోటారువాహనాల చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది.