ఓటీటీ లోకి వచ్చేస్తున్న ఎమోషనల్ లవ్ స్టోరీ…!

-

మణికందన్, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా వచ్చిన లేటెస్ట్ సినిమా ట్రూ లవర్. ఈ సినిమాకి ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. తమిళంలో లవర్ పేరుతో ఈ సినిమాని తీసుకువచ్చారు. తెలుగులో ట్రూ లవర్ గా ఈ సినిమాని డైరెక్టర్ మారుతి బేబీ ప్రొడ్యూసర్ కలిసి రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్రభురాం వ్యాస్ తెర మీదకు తీసుకువచ్చారు కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుంటున్న ఇద్దరి ప్రేమికుల గురించి కథ.

ట్రైలర్ టీజర్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసాయి కథలో కొత్తతనం లేకపోవడం వలన బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. తమిళంలో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ట్రూ లవర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తోంది. ఈ సినిమా తమిళం అలానే తెలుగు స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ గా తీసిన ట్రూ లవర్ సినిమా మార్చి 8 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news