విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వెనక్కి తగ్గిన ట్రంప్..!

-

ఆన్‌లైన్ ద్వారా క్లాసుల‌కు హాజ‌రవుతున్న విదేశీ విద్యార్థుల వీసాల‌ను ర‌ద్దు చేయాల‌ని జూలై 6వ తేదీన అమెరికా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్ స‌ర్కార్ ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల నుంచి ఆందోళ‌న‌లు వ్య‌క్తం కావ‌డం, పలు రాష్ట్రాలు పెట్టిన కేసులతో…అమెరికా ప్ర‌భుత్వం వివాదాస్పద వీసా విధానాన్ని ర‌ద్దు చేసింది. మసాచుసెట్స్‌లోని యుఎస్ జిల్లా న్యాయమూర్తి అల్లిసన్ బురోస్ మాట్లాడుతూ..

 

విదేశీ విద్యార్థుల వీసాల రద్దును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై యుఎస్ ప్రభుత్వం, హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జులై 6 నిబంధనలను వెనక్కి తీసుకొని మునుపటి స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ఒప్పందానికి వచ్చాయన్నారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా అంతర్జాతీయ విద్యార్థులకు తరగతులను ఆన్‌లైన్‌లో బోధించడానికి, విద్యార్థి వీసాలతో దేశంలో చట్టబద్ధంగా ఉండటానికి మార్చిలో అమలు చేసిన విధానాన్ని ఈ ఒప్పందం తిరిగి ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version