ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష పదవి సంబంధించిన తుది ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. చివరిగా జో బైడెన్ కి 306 ఎలక్టోరల్ ఓట్లు లభించగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి 232 ఓట్లు లభించాయి. అయితే ఈ తుది ఫలితం చూశాక ట్రంప్ వేదాంత ధోరణిలోకి వచ్చేశాడు అని చెప్పక తప్పదు. జార్జియా మొత్తం బైడెన్ కి సొంతం అయింది. కాగా ఇక 270 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నిక అవుతాడని అమెరికా చట్టాలు చెబుతున్నాయి.
దీంతో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే అని ప్రమాణస్వీకారం మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఇక ఆరిజోనా ఎన్నికల ఫలితాల మీద కోర్టుకు వెళ్లాలని ముందునుంచి భావిస్తూ వచ్చిన ట్రంప్ వర్గం వెనక్కి తగ్గిందని చెబుతున్నారు, కాలమే అన్నీ నిర్ణయిస్తుంది అంటూ ట్రంప్ నోటి వెంట వేదాంతం వెలువడడంతో ఇక ఆయన ఓటమి ఒప్పుకున్నాడని భావిస్తున్నారు. దీంతో అధికారిక మార్పిడి దిశగా అమెరికాలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.