అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వ్యక్తికి మరో సారి పట్టం కట్టారు. అమెరికాకి అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరక్టర్ గా ఇండో అమెరికన్ కంప్యూటర్ నిపుణులు అయిన సేతురామన్ పంచనాధాన్ ని నియమించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎస్ఎఫ్ ఎన్నో కీలక విప్లవాత్మకమైన నిర్ణయాలని తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాదు
సైన్స్ ఇంజనీరింగ్ యొక్క అన్ని రంగాలలో ప్రాధమిక పరిశోధన, విద్య కి సహకరిస్తుంది. ప్రస్తుత ఎన్ ఎస్ ఎఫ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఫ్రాన్స్ కి చెందిన కోర్దోవా పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ తరువాత ఈ కీలక బాధ్యతలు చేపట్టే విధంగా ట్రంప్ సేతురామన్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే సేతురామన్ ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా చీఫ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
అంతేకాదు ఏఎస్యూ యొక్క సెంటర్ ఫర్ కాగ్నిటివ్ యుబిక్విటింగ్ కంప్యూటింగ్ వ్యవస్థాపక డైరక్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.గతంలో అంటే ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా జాతీయ సైన్స్ బోర్డ్ సభ్యుడిగా సేతురామన్ ని నియమించడం జరిగింది. ఇదిలాఉంటే సేతురామన్ నియామకం పట్ల పలు భారతీయ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.