రేషన్ సరుకుల్లో ఇక నుంచి మాంసాహారం… ఎందుకంటే…!

-

భారత్ లో పిల్లల్లో పోషకాహార లోప౦ అనేది ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. దీనితో వేలాది మంది పిల్లలు ప్రతీ ఏటా మరణిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే ప్రజల్లో మార్పు రాక జనాభా అనేది తీవ్రంగా పెరిగిపోవడంతో ఆహారం కొరత కూడా భారీగా పెరుగుతుంది. దీనితో పోషకాహారం అనేది పిల్లలకు అందే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. దేశంలో పెరిగిపోతున్న పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దేందుకు రేషన్ షాపుల ద్వారా చికెన్ గుడ్లు చేపలు తదితర మాంసాహార పదార్థాలను అందజేయాలని నీతి అయోగ్ నీతి అయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ర తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం బియ్యం చక్కెరే ఇస్తున్నారు.

కానీ ఇప్పటి నుంచి చేపలు, చికెన్ వంటి వాటిని కూడా అందించే అవకాశాలు కనపడుతున్నాయి. దేశంలో కల్తీ పదార్థాల వల్ల ప్రజలు రోగాల బారిన పడి వైద్యానికే ఖర్చు చేస్తున్నారని..సబ్సిడీ ద్వారా నాణ్యమైన మాంసాహారాన్ని అందిస్తే పౌష్టికాహారం లభిస్తుందన్నారు. దేశంలోని చిన్నారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని.. చవకగా రేషన్ షాపుల ద్వారా వీటిని పంపిణీ చేయాలన్నారు. అయితే దేశం ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక అవి త్వరగా పాడయ్యేవి కావడం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పే.

Read more RELATED
Recommended to you

Exit mobile version