తెలంగాణ ఆడబడుచుకు అమెరికాలో దక్కిన గొప్ప గౌరవం ఇది!

-

ప్రపంచం ఎంత కుగ్రామంగా మారిపోయి.. అంతా ఒక్కటే అని అంటున్నా… మన దేశం వారు, మన రాష్ట్రం వారు అనేసరికి ఏదో తెలియని ఆనందం! ప్రస్తుతం భారతీయులందరికీ… ప్రత్యేకంగా, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ ఆడపడుచుల స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలియచెప్పిన తెలంగాణ ఆడపడుచు.. అగ్రరాజ్యంలో అతి పెద్ద పదవిని పొందిన సంఘటన తాజాగా జరిగింది.

భారత సంతతికి చెందిన పలువురు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా కీలక పదవులు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ఆడబడుచు సరితా కోమటిరెడ్డి న్యూయార్కు ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఈ తెలంగాణ ఆడపడుచును నియమిస్తూ… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రంప్ సిఫార్సుకు సెనేట్ కానీ ఆమోదిస్తే.. న్యూయార్కులోని తూర్పు జిల్లా కోర్టుకు న్యాయమూర్తిగా తెలంగాణ ఆడపడుచు విధులు నిర్వహిస్తారు.

కాగా… తెలంగాణలో పుట్టి పెరిగిన సరితా కోమటిరెడ్డి తర్వాతి కాలంలో హార్వర్డ్ లా స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందరు. అనంతరం కొంతకాలం లెక్చరర్ గా పని చేశారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ నార్కోటిక్స్, మనీలాండరింగ్, హాకింగ్ అండ్ ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్ గా పని చేశారు. సరితా కోమటిరెడ్డి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఏది ఏమైనా అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఈ తాజా నియామకం.. తెలంగాణ ఆడబడుచుకు దక్కిన గౌరవంగానే భావించాలి!

Read more RELATED
Recommended to you

Latest news