‘మోదీ నా దోస్త్‌..’ అని చెప్పుకున్న ట్రంప్‌!

-

భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి దోస్త్‌ అని చెప్పుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. మేరీలాండ్‌లోని అండ్రూస్‌ వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు బయలుదేరే ముందు ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత ప్రజలను కలుసుకోవడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కూడా ట్రంప్‌ చెప్పాడు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. తన కుటుంబసభ్యులతోపాటు మరో 12 మంది వైట్‌హౌస్‌ ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం రాత్రి భారత్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ‘భారత ప్రధాని నరేంద్రమోదీ నా స్నేహితుడు. వచ్చే రెండు రోజులు నేను ప్రధాని మోదీతో, లక్షల మంది భారీయులతో గడుపబోతుండటం చాలా సంతోషం కలిగిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు.

సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌కు చేరుకోనున్న ట్రంప్‌ ముందుగా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి మొతేరా స్టేడియంలో జరుగనున్న ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి మార్గమధ్యలో తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి భవన్‌లో సాదర స్వాగతం స్వీకరిస్తారు.

ఆ తర్వాత, రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ, ట్రంప్‌ సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మొత్తానికి 36 గంటల పర్యటన అనంతరం మంగళవారం రాత్రి ట్రంప్‌ బృందం అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version