అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులకు అక్కడి యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవుల కోసం స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు.. ఇటీవల అమెరికా ఎన్నికల ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందే తిరిగి అమెరికాకు రావాలని మెసేజులు పంపుతున్నాయి.
వ్యాలిడ్ వీసాలు ఉన్న విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఎటువంటి చాన్స్ తీసుకోకూడదని యూనివర్శిటీలు మెసేజులు పంపుతున్నట్లు సమాచారం. ఇధిలాఉండగా జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికార మార్పిడికి సంబంధించి ఇప్పటికే వేగంగా కసరత్తు జరుగుతోంది. అయితే, ట్రంప్ అధికారం చేపట్టగానే ఇల్లిగల్ ఇమిగ్రంట్స్‌ను దేశం నుంచి బయటకు పంపిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తోడు స్టూడెంట్ వీసాలపై కూడా సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.