తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడం లేదు. హాస్టల్లో ముద్దల అన్నం తినలేక ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్తున్నారు.మరికొందరు విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక హోటల్లో టిఫిన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వెలుగుచూసింది. మధ్యాహ్నం వడ్డించిన భోజనం పూర్తిగా మెత్తగా మారి ముద్దలై గడ్డలు కట్టి పలుకైంది. దీంతో ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక పడేశారు.దీంతో ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లారు.ఈ విషయంపై విద్యార్థులు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.రాష్ట్ర ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.
ముద్దల అన్నం తినలేక ఖాళీ కడుపులతోనే తరగతి గదుల్లోకి వెళ్లిన విద్యార్థులు
ఆకలికి తట్టుకోలేక హోటల్లో టిఫిన్ చేసిన కొంత మంది విద్యార్థులు
యాదాద్రి భువనగిరి – మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వడ్డించిన అన్నం పూర్తిగా మెత్తగా ముద్దలై గడ్డలు కట్టి పలుకైంది.. దీంతో ఆ… pic.twitter.com/y2VmP2Yn13
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2024