తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు మరియు ఎన్నికల వ్యూహాలతో తర్జన భర్జన పడుతున్నాయి. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఒక 40 మంది కలిసి ఢిల్లీ వెళ్లారు… ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ను కలవడం జరిగింది. వీరికి మధ్యన జరిగిన చర్చలో బీసీ నేతలు వేణుగోపాల్ దృష్టికి ఒక ముఖ్యమైన డిమాండ్ ను వినిపించారు. తెలంగాణాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఉన్న మొత్తం సీట్లలో 34 సీట్లు బీసీ నేతలకు కేటాయించాలని వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లారు. వీరి అభ్యర్ధనను విన్న వేణుగోపాల్.. సీట్ల కేటాయింపు విషయంపై ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని, ఇప్పటికే టికెట్లపై తీవ్రంగా చర్చ జరుగుతోందని మీరు అడుగుతున్న విధంగానే బీసీ లకు ఎక్కువ శాతం సీట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అంటూ హామీ ఇచ్చారు.
మరి ఫైనల్ గా వచ్చే సమయానికి ఎన్ని సీట్ లను బీసీ లకు కేటాయిస్తారు అనాది మాత్రం తెలియాల్సి ఉంది.