ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీని ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం… ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది.
రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలని గతంలో ఆదేశాలు జారీ చేసిన ఎన్జీటీ… కేఆర్‌ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు సందర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులను ఏపీ అడ్డుకుంటోందన్న తెలంగాణ ప్రభుత్వం… రాయలసీమ ఎత్తిపోతల సందర్శించాలని ఎన్జీటీ బృందాన్ని విజ్ఞప్తి చేసింది.
ఎన్జీటీ బృందం పర్యటనకు అన్ని వసతులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్జీటీ బృందానికి హెలికాప్టర్, వాహనాలు, వసతులు అన్ని తెలంగాణ ప్రభుత్వమే పెట్టుకుంటుందని వెల్లడించింది. కాగా.. ఇవాళ జల వివాదంపై కేంద్రానికి తెలంగాణ పై సీఎం జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రులకు జగన్ లేఖలు రాశారు.