తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న వైఎస్ షర్మిల.. ఈనెల 8న ప్రకటించబోయే వైఎస్సార్టిపీ జెండాను వైఎస్ షర్మిల ఇవాళ ఆవిష్కరించారు. ఈ జెండాలో 70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలం రంగు మరియు పాలపిట్ట రంగు మధ్యలో తెలంగాణ మ్యాప్ ఉండగా.. సెంటర్ ఆఫ్ యాక్షన్‌గా తెలంగాణ చిత్రపటంలో వైఎస్సార్ బొమ్మ పెట్టారు. అచ్చం వైసీపీని పోలిన జెండాలాగే ఉంది షర్మిల కొత్త పార్టీ జెండా.
అంతేకాదు.. పార్టీ పేరుపై కాస్త క్లారిటీ ఇచ్చారు షర్మిల బృందం. “యువ శక్తి రైతు తెలంగాణ పార్టీ” అని పార్టీకి నామకరణం చేసేందుకు షర్మిల సిద్ధమైనట్లు సమాచారం. అయితే.. పార్టీ పేరుపై ఈ నెల 8న క్లారిటీ రానుంది. కాగా… దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నారు.
ఈ నెల 8వ తేదీ ఉదయం ఇడుపుల పాయలో 8.30 గంటలకు ప్రార్థనలు చేయనున్నారు షర్మిల. అనంతరం… కడప నుంచి ప్రత్యేక చాపర్ లో 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… 4 గంటలకు JRC కన్వెన్షన్ కు చేరుకోనున్నారు. అనంతరం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.