ఆర్టీసీ ఎప్పూడూ నష్టాల్లో ఉంటుందనే మాటే వినిపించేది కానీ ఇప్పుడు మెల్లి మెల్లిగా నష్టాల్లో నుండి కూరుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. టికెట్ల అమ్మకం ద్వారా తెలంగాణ ఆర్టీసీకి రోజుకు రూ.9 కోట్ల ఆదాయం వస్తుందని మంత్రి వెల్లడించారు. దానిని మరో రూ.2 నుండి రూ.3 కోట్ల వరకూ పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి అన్నారు. ఆర్టీసీ ఆదాయం ఖర్చుల వివరాలు మరియు అప్పుల వివరాలపై మంత్రి అజయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
బడ్జెటేతర నిధుల కింద తొలి విడతగా రూ.1000 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు అయ్యాయని..అందులో రూ.500 కోట్లు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కేవలం రవాణా ద్వారా మాత్రమే ఆదాయాన్ని ఆర్జించకుండా ఇప్పుడు ఆదాయం పెంచుకునేందుకు కొత్త కొత్త దారులను వెతుకుతోంది. ఇటీవల హైదరబాద్ లో ఇల్లు షిష్ట్ అయ్యేవారి సామాన్లను కూడా చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతాని వస్తువులను రవాణా చేసే సమయంలో వస్తువులను హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించింది.