నంది లేని శివుడు.. శివుడు లేని నంది.. “శివాలయం” చూసొద్దాం రండి

-

దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఒకటి. ఏ శివాలయం లో అయినా లింగానికి ఎదురుగా నందిని ప్రతిష్టిస్తారు. అయితే కాశీ విశ్వేశ్వర ఆలయంలో అందుకు భిన్నంగా లింగానికి ఎదురుగా నంది ఉండదు. అవును ఇది నిజమే! ఈ ఒక్క శివాలయంలోని నంది ఎందుకు ప్రతిష్ఠించ లేదు? అందుకు ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే. ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఆ కారణాలను ఇక్కడ తెలుసుకుందాం

శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం | శివాల‌యం
శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం | శివాల‌యం

భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు ఆలయాల అన్నింటినీ ధ్వంసం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇలా దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అని కూల్చి వేసాడు. ఔరంగజేబు అతని సైన్యం కాశీ విశ్వేశ్వర దేవాలయం పై కూడా దండెత్తారు. కాశీ విశ్వేశ్వర దేవాలయం ధ్వంసం చేయడం మొదలు పెట్టగానే, అక్కడ ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారి శివలింగాన్ని తీసుకెళ్ళి పక్కగా ఉన్న బావిలో పడేశారు. ఆలయ ప్రధాన ద్వారాన్ని దాదాపుగా కూల్చేశారు. కానీ కొద్ది భాగం శిథిలాలు గా మారాయి. అయితే ఆ శిథిలాల పైనే ఇప్పటి జ్ఞాన్ వాపి మసీదు నిర్మించారు.

అయితే ఆలయాన్ని ధ్వంసం చేయక ముందు స్వామివారి శివలింగానికి ఎదురుగా నంది ఉండేది. అయితే ఔరంగజేబు ధ్వంసం చేసే సమయంలో ఆ నందీశ్వరుని విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు. అయితే ఆనంది ఇప్పటికి కూడా పాత ఆలయ ప్రాంగణంలో ఉంది. తరువాత ఆ బావి నుండి శివలింగాన్ని వెలికితీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ శివలింగం బయటపడలేదు. దాంతో చేసేదేమీ లేక ఆ లింగం ఉన్న రూపంలో కొత్త లింగాన్ని తయారుచేసే నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు.

అయితే కాశీవిశ్వేశ్వరుని దర్శించుకునే ప్రతి ఒక్కరూ పాత శివాలయం లో నందీశ్వరుని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. అలాగే పక్కన ఉన్న బావిలో శివలింగం ఉందనే నమ్మకంతో ఆ బావి కి కూడా పూజలు చేసి దర్శించుకుంటారు. ఆ బావిలోని నీటిని మహా తీర్థ ప్రసాదం గా భావిస్తారు.

శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే
40 స్తంభాలతో నిర్మించిన పురాతన శివాలయం ఎక్కడుందో తెలుసా ?

Read more RELATED
Recommended to you

Latest news