తెలంగాణలో కొలువుల జాతర.. మరో రెండు నోటిఫికేషన్లు జారీ..!

-

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది టీఎస్‌పీఎస్సీ. వ్యవసాయ శాఖతో పాటు విద్యా శాఖలో పలు పోస్టుల భర్తీకి బుధవారం రాత్రి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్లను జారీ చేసింది. అలాగే విద్యాశాఖలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ లకు సంబంధించిన దరఖాస్తులను జనవరి 6 నుంచి 27వరకు స్వీకరించనున్నారు. అలాగే, వ్యవసాయ అధికారి పోస్టులకు సైతం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టులకు జనవరి 10 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news