తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్-4కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తం 8,039 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ మొదలై నేటికి 12 రోజులైంది. వారం రోజులుగా రోజుకి సగటున 30 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే.. గ్రూప్-4 దరఖాస్తుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. TSPSC వెబ్‌సైట్ అప్లై చేస్తుండగా.. ఫీజు కింద అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతున్నా.. పేమెంట్ అన్సక్సెసఫ్ఫుల్ అని చూపిస్తోందని, తర్వాత సర్వర్ ఎర్రర్ అని వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు TSPSC కార్యాలయానికి ఫోన్లు చేసినా స్పందించడం లేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి 10వ తేదీ వరకు దాదాపు 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తు అందినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 30వ తేదీవ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. దీంతో పోటీ పడేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.