ప్రజలకు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ కీలక విజ్ఞప్తి

-

ఫెడెక్స్‌ కొరియర్‌ పేరుతో చాలా మందికి కాల్స్‌ వస్తున్నాయి. ఆధార్‌ నెంబర్‌తో పార్సిల్‌ వచ్చిందని.. అందులో అక్రమంగా రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు.డ్రగ్స్‌ రవాణా కేసులో శిక్షలు కఠినంగా ఉంటాయని.. కేసుల నుంచి తప్పించుకునేందుకు రూ.లక్షల్లో డబ్బులు సైబర్‌ నేరగాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఫెడెక్స్‌ పార్సిల్స్‌ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ని నమ్మొద్దని.. పోలీసులమని చెప్పగానే భయపడి డబ్బులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ,ఏదైనా అనుమానం వచ్చినా.. మోసపోయినా వెంటనే 1930 నంబర్‌కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.అయితే, సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డ వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉన్నారని అన్నారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త కొత్త వాటిని ఎంచుకుంటున్నారని,ఇంతకు ముందు ఓటీపీ, ఓఎల్ఎక్స్, రెంట్ పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆయన.. తాజాగా ఫెడెక్స్‌ పేరుతో మోసాలకు తెరలేపారని తెలిపారు. తాము పోలీస్‌స్టేషన్‌ నుంచి మాట్లాడుతున్నామని.. మీరు పంపిన పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version