వసంత పంచమికి తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ వేడుక సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ పర్వదినం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు చేసేందుకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 26న బాసర, వర్గల్‌కు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్టు టీఎస్ ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
మొత్తంగా 108 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. వీటిలో నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లా వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ట్విటర్‌లో తెలిపారు. ఆయా ప్రత్యేక బస్సులు ఎక్కడి నుంచి బయల్దేరుతాయి? ఛార్జీలు వంటి వివరాలను ఆయన షేర్ చేశారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి ఏటా వసంత పంచమి రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనం అర్ధరాత్రి నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరుతుంటారు.
వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 108 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది. pic.twitter.com/aUHnfME6VM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 24, 2023