స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ ‘BharOS’ ఆవిష్కరణ.. కేంద్రమంత్రుల తొలి వీడియోకాల్‌

-

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో ఐఐటీ మద్రాస్‌ తొలి స్వదేశీ మొబైల్‌ ఓఎస్‌ను రూపొందించింది. ‘భారోస్‌’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్‌, అశ్వినీ వైష్ణవ్‌ నేడు ఆవిష్కరించారు. అనంతరం ఈ ఓఎస్‌ను మంత్రులు విజయవంతంగా పరీక్షించారు.

ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో పనిచేసే మొబైల్‌ నుంచి కేంద్రమంత్రులు.. ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర సమాచార, ఐటీశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఇది కీలక ముందడుగు. ఎనిమిదేళ్ల క్రితం ఆయన డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడినప్పుడు చాలా మంది విశ్వసించలేదు. కానీ ఇప్పుడు, ఆయన దృక్పథం నిజమని దేశ ప్రజలు నమ్ముతున్నారు’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news