తిరుమ‌ల‌లో రూ.100 కోట్ల చోరీ…భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణి అవకతవకలపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణిలో రూ.100 కోట్ల చోరీ జరిగిందని బాంబ్ పేల్చారు.

TTD board member Bhanu Prakash Reddy
TTD board member Bhanu Prakash Reddy

అప్పటి పెద్దలు స్వామివారి పేరుతో రూ. 40 కోట్ల ఆస్తులను రాయించుకున్నారని వెల్ల‌డించారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారు? అని నిల‌దీశారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రికార్డుల్లో ఉందన్నారు. రాజీ కుదిర్చిన అధికారులు ఎవరు? అని ప్ర‌శ్నించారు భాను ప్రకాష్ రెడ్డి. దీంతో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చేసిన‌ సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news