భక్తులకు అలర్ట్‌.. రేపటి వరకు మల్లన్న స్పర్శదర్శనం బంద్

-

గంగా నదిలో రెండు వేల సార్లు మునిగినా, లేదా కాశీ క్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసిస్తే లభించేంత పుణ్యం.. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుందని ధార్మికుల విశ్వాసం. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునులు కొలువైన ఈ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. భువిపై వెలసిన కైలాశంగా పేరొందిన శ్రీశైలం.. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. ఆదిశక్తి కొలువుదీరిన 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన ప్రాంతంగానూ శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, శ్రీశైలం ‘భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి’ క్షేత్రంగా పేరొందింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఉంది. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించారు.

శ్రీశైల మహాక్షేత్రంలో జనవరి 2వ తేదీ వరకు మల్లన్న స్పర్శదర్శనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్, ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మల్లన్న స్పర్శదర్శనం తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిపారు.మల్లికార్జున స్వామి గర్భాలయ అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్న వారికి కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version