తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. వాట్సాప్ ద్వారా స్వామి వారి దర్శనం కోసం భక్తులు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించే ప్రతిపాదనను అధికారుల దృష్టి తెచ్చారు.దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
తిరుమలకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో పాటు వీఐపీ,వీవీఐపీల సిఫార్సు లేఖల ఒత్తిడి పెరిగింది. అందుకే వాట్సాప్ బుకింగ్ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇకపై ఎవర రికమెండేషన్‌తో పనిలేదు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. వాట్సాప్ ద్వారా బుకింగ్ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లోనూ ఇదే విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.