ఏపీలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై దాణా కుంభకోణం ఆరోపణలు చేయగా..దీనిపై తాజాగా సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల పవిత్రను, టీటీడీ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సీపీఐ నారాయణ అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇలాంటి దేవాలయానికి చెడ్డ పేరు వస్తే నష్టం తిరుపతి ప్రజానీకానికే అని అన్నారు.దాణా కుంభకోణంలో అక్రమాలు జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విషయాలను పెండింగ్ పెడితే ప్రజలకు అనుమానాలు ఎక్కువవుతాయని, అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఐ నారాయణ కోరారు.