మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన సందర్భంగా హెలికాప్టర్‌లో వచ్చిన విషయం తెలిసిందే. పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.ఫలితంగా జగన్ రోడ్డు మార్గంలో వెళ్లాల్సి రాగా.. ఆయన వైసీపీ అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకోగా..తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో పోలీసులు హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్, కోపైలట్ శ్రేయజ్ జైన్‌లకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.ఈ నెల 8న పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసుల విచారణ చేపట్టారరు. ఆ పర్యటనకు చిప్సాన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ను జగన్ వినియోగించారు. తాజాగా నేడు విచారణకు పైలట్, కోపైలట్ హాజరయ్యారు. చెన్నేకొత్తపల్లి సీఐ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా.. ఆ రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.