రాజీవ్ యువవికాసంపై బ్యాంకర్లతో భట్టి విక్రమార్క భేటీ

-

తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం.. రాజీవ్ యువ వికాసం స్కీం ద్వారా ఆర్థిక సాయం చేసి నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా చర్యలు చేపడుతోంది.

ఈ మేరకు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బుధవారం రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కీలక సమావేశం నిర్వహించారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్లు సైతం ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించేలా ఆయన కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news