రాజధాని తరలింపు అంశంపై తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

-

రాజధాని తరలింపు అంశంపై ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ఘాటుగా స్పందించారు. రాజధానిని విశాఖకు తరలిస్తే రాయలసీమకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గురువారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రిక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇది పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. పంటి నొప్పికి తుంటిమీద తన్నినట్లుంది అని మూడు రాజధానుల అంశంపై మండిపడ్డారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా తెప్పించాలి. బుందేల్ ఖండ తరహా ప్రత్యేక ప్యాకేజీ తెప్పించాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయాలి. విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో రైల్, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ తెప్పించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకుండా చూడాలి. ప్రస్తుత రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని 2022 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version