RRR సీన్‌తో టీ కాంగ్రెస్‌ ప్రచారం.. మామూలుగా లేదుగా..

-

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరు గ్యారెంటీలను టీ కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రజల్లోకి తీసుకెళుతుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో టీ కాంగ్రెస్ జోరుగా ఆరు గ్యారెంటీలపై ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ ట్విట్టర్ వేదికగా టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఒక వీడియో మార్ఫింగ్ చేసి రాహుల్ గాంధీ ఫేస్ క్రియేట్ చేసి ఓ ఎడిట్ వీడియో రిలీజ్ చేశారు. ఇది తాజాగా వైరల్ గా మారింది. టీ కాంగ్రెస్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ… ‘వస్తున్నా… దొర గడీలో బందీ అయిన తెలంగాణను రక్షించడానికి.. అంటూ ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్లు పథకం, యువ వికాసం పథకం, చేయూత పథకం గురించి పోస్ట్ చేశారు.

ఇది ఇలా ఉంటె, గత అనుభవాల దృష్ట్యా వచ్చే విపత్తును కాంగ్రెస్ ముందుగానే ఊహించింది. ఆ విపత్తును ఎదుర్కునేందుకు టీ కాంగ్రెస్ అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటుంది. టీ కాంగ్రెస్‌కు అభ్యర్థుల ఎంపిక ఒక సవాల్ అయితే, క్యాండిడేట్స్ ప్రకటన తర్వాత వచ్చే పెను తుఫాన్ అతిపెద్ద ప్రమాదంగా మారే సూచనలు ఉన్నాయి. అందుకే ఆ విపత్తు నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ దారులు వెతుక్కుంటుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత జరిగే పరిణామాలకు మెడిసిన్ వేసే బాధ్యతను సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ జానారెడ్డికి అప్పగించింది.. జానారెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జి ఠాక్రే, ఎన్నికల పరిశీలకులు దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌కు ఈ బాధ్యత అప్పగించారు. 20 కి పైగా నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం ద్విముఖ, త్రిముఖ పోటీ ఉంది. ఇందులో ఏ ఒక్కరికి టిక్కెట్ ఇచ్చినా మిగతా వారు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఎన్నికల్లో టీ కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోటీ ఎక్కువ ఉన్న నియోజకవర్గ నేతలతో మాట్లాడే బాధ్యతను జానారెడ్డి కమిటీకి అప్పగించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version