బోర్డర్ లో సొరంగం.. పాకిస్తాన్ నుంచి ఈజీగా వచ్చేలా !

-

ఎన్ని చెప్పినా పాకిస్తాన్ తన బుద్ధి ఎలాగోలా బయట పెట్టుకుంటోంది. జమ్మూ కాశ్మీర్‌ లోని భారత్‌, పాకిస్థాన్‌ బోర్డర్ లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్‌ బాగ్ సింగ్‌ ప్రకటించారు. 2.5 మీటర్ల వెడల్పుతో, 25 నుంచి 30 మీటర్ల లోతులో ఈ సొరంగం ఉందని గుర్తించారు. బయట వైపు గడ్డితో కప్పి ఉంచారు.

అయితే ఆ సొరంగంలో లభించిన ఇసుక బస్తాలు పాక్‌లోని కరాచీలో తయారయ్యాయని ముద్రించి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అలానే మొన్న నగ్రోటా సమీపంలోని బాన్ టోల్‌ ప్లాజా దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ ‌లో మరణించిన నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఈ సొరంగ మార్గం ద్వారానే భారత్‌లోకి చొరబడి ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇక మరణించిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 28 నుంచి జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు దాడులు చేసేలా ఈ సంస్థ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news