న్యాయమూర్తులపై అసభ్య సోషల్ పోస్టింగులు, అలాగే అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన విచారణ మీద సీబీఐ స్పీడ్ పెంచింది. విజయవాడ లో రెండో రోజు న్యాయమూర్తులపై అసభ్య పోస్టింగులు పై సీబీఐ విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులపై అసభ్య పోస్టింగ్ లపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న న్యాయవాది లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు పిలిపించుకుని ప్రశ్నించారు.
అసలు ఆయన ఫిర్యాదు వలెనే ఈ విషయం హైలైట్ అయింది. అందుకే ముందు అయ్యన్ను విచారించారు అధికారులు. ఇక ఈరోజు హైకోర్టు రిజిస్ట్రార్ ను కలిసి పోస్టింగ్ లకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లు తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. న్యాయమూర్తులను కించపరిచేలా పెట్టిన పోస్టింగ్ పై తమ క్యాడర్ కు అండగా ఉంటామని వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు పండుల రవీంద్ర బాబు,ఆమంచి కృష్ణ మోహన్ లను ఈ రోజు విచారించే అవకాశం ఉందని అంటున్నారు. సీఐడీ విచారణతో తృప్తి చెందని హైకోర్టు ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.