వైర‌స్‌ల‌కు మెడిసిన్ మ‌న ఇండ్ల‌లోనే ఉంది.. ప‌సుపు.. బ్ర‌హ్మాస్త్రం..!

-

చంక‌లో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెదికిన‌ట్లు ఉంది.. అని సామెత ఉంది తెలుసు క‌దా.. అవును.. ఇప్పుడు వైర‌స్‌ల విష‌యంలో కూడా అదే నిజ‌మ‌ని రుజువ‌వుతోంది. ఎందుకంటే ఎన్నో ర‌కాల వైర‌స్‌ల‌కు మెడిసిన్ మ‌న ఇండ్ల‌లోనే ఉంద‌ని తేలింది. అది మ‌రేమిటో కాదు.. ప‌సుపు.. అదే బ్ర‌హ్మాస్త్రం. అవును.. సైంటిస్టులు దీనిపై ప్ర‌యోగాలు చేసి తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఎన్నో వైర‌స్‌ల‌ను నాశ‌నం చేస్తుంద‌ని సైంటిస్టులు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

turmeric which has the compound curcumin has antiviral properties

ట్రాన్స్‌మిష‌బుల్ గ్యాస్ట్రోఎంట‌రైటిస్ వైర‌స్ (టీజీఈవీ) అనే ఓ ఆల్ఫాగ్రూప్ క‌రోనా వైర‌స్ పందుల‌కు వ్యాప్తి చెందుతుంది. దీనికి గాను పందుల‌కు వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వైర‌స్‌ పందుల‌కు సోకితే ప్రాణాంత‌క‌మ‌వుతుంది. అయితే ఇదే వైర‌స్‌ను ప‌సుపులోని క‌ర్‌క్యుమిన్ చంపుతుంద‌ని తేలింది. శ‌రీరంలోని క‌ణాల్లో వైర‌స్ క‌ణాలు ప్ర‌వేశించ‌కుండా క‌ర్‌క్యుమిన్ అడ్డుకుంటుంద‌ని, ప్ర‌వేశించిన వైర‌స్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ని.. అలాగే వైర‌స్‌లు వృద్ధి చెంద‌కుండా వాటిని ఇనాక్టివ్ చేస్తుంద‌ని గుర్తించారు. ఇక అత్య‌ధిక డోసుల్లో క‌ర్‌క్యుమిన్‌ను ఇస్తే డెంగీ వైర‌స్‌, హెప‌టైటిస్ బి, జికా వైర‌స్‌లు కూడా నాశ‌నం అవుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే ఇప్ప‌టికే చాలా మంది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని చెప్పి పాల‌ల్లో ప‌సుపు క‌లుపుకుని తాగుతున్నారు. క‌రోనా బారిన ప‌డి హోం ఐసొలేష‌న్‌లో చికిత్స పొందుతున్న‌వారు కూడా ఈ మిశ్ర‌మాన్ని నిత్యం సేవిస్తున్నారు. దీంతో చాలా మంది త్వ‌ర‌గా కోలుకున్నారు కూడా. ఈ క్ర‌మంలోనే తాజాగా ప‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ గురించిన ఈ విష‌యం వెల్ల‌డి కావ‌డం నిజంగా శుభ‌వార్తే. ఇక దీనిపై సైంటిస్టులు మ‌రిన్ని ప్ర‌యోగాల‌ను కూడా చేస్తున్నారు. కాగా పైన తెలిపిన ప‌రిశోధ‌న‌ల‌కు చెందిన వివ‌రాల‌ను వారు జ‌న‌ర‌ల్ వైరాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. అవును.. అస‌లు మ‌నం నిజంగా ఇంట్లోనే మెడిసిన్‌ను పెట్టుకుని ఏవేవో ప్ర‌య‌త్నిస్తున్నామ‌నిపిస్తుంది. ఇక వైర‌స్‌ల విష‌యంలో అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెందుతున్నామ‌ని కూడా అనిపిస్తోంది. క‌నుక భ‌య‌ప‌డ‌కండి.. ఇంటి చిట్కాల‌ను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోండి. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించండి.. వైర‌స్ మీ జోలికి రానే రాదు..!

Read more RELATED
Recommended to you

Latest news