టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన పదిమంది పోలీసులు బృందం కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా రవిప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఇప్పడు ఇదే తెలుగు రాజకీయ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రవిప్రకాష్‌పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్‌క్రైమ్ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులకు సంబంధించి విచారణకు రవిప్రకాష్ హాజరై.. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత కొద్దికాలంగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అయితే ఈరోజు అకస్మాత్తుగా ఎలాంటి కారణాలు చూపకుండా రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.