హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసు లో కొత్త కోణం కనపడింది శివ బాలకృష్ణ అవినీతి వెనుక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్లు సిబిఐ అనుమాన పడుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలని ఏసీబీ సేకరిస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులు చిట్టాని ఏసీబీ విప్పుతోంది.
మూడు రోజుల విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి శివ బాలకృష్ణ భార్య బంధువు పేరు మీద మూడు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు ఆ మూడు లాకర్లు ని ఎసిబి ఓపెన్ చేసింది. బినామీలకి రెండు నెలల క్రితం హోండా సిటీ కార్ల ని శివ బాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది కారు గిఫ్ట్ ల మీద ఏసీబీ లోతుగా విచారిస్తోంది.