హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్‌లు మృతి

-

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి లో హెచ్ సి యు రోడ్ లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కాగా… మరొకరు బ్యాంకు ఉద్యోగి అబ్దుల్.

నాలుగో వ్యక్తి జూ నియర్ ఆర్టిస్ట్ సిద్ధూ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మృతులను అబ్దుల్ రహీం, ఏం మానస, ఎస్ మా నస లు గా గుర్తించారని పోలీసులు. వీరు అమీర్ పేట లోని హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ మూడు మృత దేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు సిటీ పోలిసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version