సిఎం ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో 800 మంది పిల్లలకు తిండి లేదు

-

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. పాటియాలాలో 800 మంది పిల్లలు మిడ్ డే భోజన పథకం కింద ఏడు నెలలుగా తమకు కేటాయించిన రేషన్‌ ను అందుకోలేదు. కరోనా కారణంగా స్కూల్స్ ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో నెలవారీ ప్రాతిపదికన పాఠశాల పిల్లలకు మధ్యాహ్నం భోజన రేషన్ అందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించినప్పటికీ ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.Bundle of lies': Oppn parties trash CM Amarinder Singh's 3-year report card  | Cities News,The Indian Express

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కరమ్ జీత్ సింగ్ విద్యార్థులకు రేషన్ పంపిణీ చేయడం లేదు అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కూల్ సిఎం నివాసానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాటియాలా పాఠశాల ప్రిన్సిపాల్ ఏడు నెలల నుండి సుమారు 800 మంది విద్యార్థులకు రేషన్ ఇవ్వలేదు అని అంగీకరించారని కాని ఎందుకో చెప్పలేదని జాతీయ మీడియా పేర్కొంది. మంజూరు చేసిన 14 కిలోల బియ్యం, గోధుమలను ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version