హైదరాబాద్ లో ఇద్దరు ఎంఐఎం నేతల హత్య !

హైదరాబాద్ లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ముందుగా అత్తాపూర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. ఎంఐఎం నాయకుడు సలీంను గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా నరికి చంపారు.  అత్తాపూర్ లోని ఒక ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద కత్తులు, రాళ్లతో ఎటాక్ చేసి చంపారు. ఈ సంఘటన అత్తాపూర్ లోని రోడ్ నెంబర్ పిల్లర్ నెంబర్ 258 వద్ద జరిగింది. హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియ రాలేదు. పాతబస్తీలోని హాసన్ నగర్ కు  చెందిన సలీం నిన్న సాయంత్రం అత్తాపూర్లో ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు. 

అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఉన్నాడు.  తిరిగి వెళ్తున్న సమయంలో కత్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఇక మరోపక్క హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో హసన్ నగర్ ప్రధాన రహాదారి పై గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హెచ్ ఎఫ్ పంక్షన్ హాల్ ఎదురుగా అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. గుర్తు తెలియని వ్యక్తిని  వెంబడించి చంపిన‌ దుండగులు, రాళ్లతో కర్రలతో గొడ్డలి తో  హత మార్చారు. వరుస హత్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురౌతున్నారు. అయితే. మృతుడు ఎంఐఎం నాయకుడు ఖలీల్ గా గుర్తించారు. ఒక్కరోజే ఇద్దరు ఎంఐఎం నేతలు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.