అఖిలప్రియ భర్త ఇంటి వద్ద హై టెన్షన్.. భారీ ఎత్తున పోలీసులు !

-

అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్  ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బోయినపల్లి కిడ్నప్ కేసులో అఖిల  భర్త భర్గవ్ రావు తండ్రి శ్రీరామ్ నాయుడు అరెస్ట్ కు రంగం సిద్ధం అయింది. యూసఫ్ గుడ్ ఎంజీఎం స్కూల్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. పోలీసులు ఇంటి వద్ద మోహరించడం తమను అరెస్టు చేస్తారన్న భయంతో తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో కారులో భార్గవ్ రామ్ తల్లిదండ్రులు మురళి నాయుడు, కిరణ్మయి పోలీసుల కళ్లుగప్పి కారులో వెళ్లిపోయారని తెలుస్తోంది.

వారు నివాసం ఉంటున్న ఇంటికి తాళం వేసి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన భార్గవ్ రామ్ తల్లిదండ్రులు నాయుడు, కిరణ్మయి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో కావాలనే పోలీసులు మాపై ఒత్తిడి చేస్తున్నారని, భార్గవ్ రామ్ మా అబ్బాయి అఖిల ప్రియ మా కోడలు వారికి మేము అండగా ఉంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news