టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో భయం భయం.. మరో ఇద్దరికి పాజిటివ్!

-

జపాన్: టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో కరోనా కలవరం కొనసాగుతోంది. ఈ విలేజ్‌లో క్రీడాకారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం ఓ క్రీడాకారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిద్దరని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో క్రీడాకారుల్లో ఆందోళన మరింత పెరిగింది. మొత్తం 11 మంది క్రీడాకారులు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ నెల 13 నుంచి ఒలింపిక్స్ విలేజ్‌ను ఏర్పాటు చేసి అందులో క్రీడాకారులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జులై 23 నుంచి ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నారు.

అయితే ఒలింపిక్స్ పాల్గొనేందుకు భారత క్రీడాకారులు టోక్యో బయలుదేరారు. వీరికి భారత ప్రధాని మోదీ విసెష్ తెలిపారు. ఎక్కువ పతకాలు సాధించుకురావాలని సూచించారు.

జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి రెండు రోజుల ముందు జులై 21నే ఫుకుషిమాలో ‘‘సాఫ్ట్‌బాల్’’ పోటీలు ప్రారంభమవుతాయి. 33 విభాగాల్లో 339 పతకాల కోసం క్రీడాకారులు పోటీ పడబోతున్నారు. తొలి పతాక ప్రధాన కార్యక్రమం జులై 24న నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version