సానియా మీర్జా గురించి తెలియని వాళ్ళు ఉండరు. టెన్నిస్ క్రీడాకారిణిగా ఎంతగానో పాపులర్ అయ్యింది సానియా. స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి అద్భుతమైన క్రీడాకారిణులపై విజయాల్ని అందుకుంది.
నిజంగా ఈమె ఆటకి, ఈమె పడ్డ కృషికి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 2007లో సింగిల్స్ లో ప్రపంచవ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచింది సానియా. ఇలా ఎన్నో రికార్డులు, విజయాలు సానియా మీర్జా కెరీర్ లో వున్నాయి. మరి ఈ క్రీడాకారిణికి సంబంధించి ఎన్నో విషయాలని మనం ఇప్పుడే తెలుసుకుందాం. ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళిపోతే..
సానియా మీర్జా కుటుంబం:
సానియా మీర్జా 1986 నవంబరు 15లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా, తల్లి నసీమా. ఈమె జన్మించిన కొత్త కాలానికే వీళ్ళు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. సానియా తన ఆరవ ఏటనే టెన్నిస్ ఆడటం మొదలు పెట్టారు.
సానియాకి 2008 డిసెంబరు 11న చెన్నైలో ఎం.జి.ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి ఇన్సిటిట్యూట్ ఆమెకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ విభాగంలో డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. అలానే సానియా స్విమ్మింగ్ లో కూడా ప్రావిణ్యురాలు.
సానియా మీర్జా అందుకున్న విజయాలు:
2001లో పూణేలో క్వార్టర్ ఫైనల్స్ లోనూ, ఢిల్లీలో ఆడిన సెమీ ఫైనల్స్ లోనూ గెలుపొందారు. 2002లో మొదట అపజాయాలు ఆమెకి ఎదురయ్యినా హైదరాబాద్, ఫిలిప్పీన్స్, మనీలాలోనూ ఆమె వరుసగా మూడు టైటిల్స్ ని గెలుచుకోవడం జరిగింది.
15 ఏళ్ల సానియా పుణేలో క్వార్టర్ ఫైనల్స్ లో, ఢిల్లీలో ఆడిన సెమీ ఫైనల్స్ లోనూ ఎంతో గొప్పగా ఆడింది.
వైల్డ్ కార్డ్ నుండి ఎపి పర్యాటక శాఖ హైదరాబాదు ఓపెన్ పోటీల్లో మొదటి రౌండులో వరుస విజయాలని ఇచ్చి ఆస్ట్రిలియన్ ప్లేయర్ చేతిలో ఊడిపోవడం జరిగింది. 2002 లో Busan లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో Leander peas తో బ్రాంజ్ మెడల్ పొందారు.
2004లో 6 ఐటిఎఫ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. అలానే 2005లో ఆస్ట్రేలియా ఓపెన్ లో కిండీ వాట్ సన్, పెట్రా మాండులా లను మొదటి, రెండవ రౌండ్లలో ఓడించి, మూడవ రౌండుకు చేరుకున్నారు.
2005 లో అయితే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ని ఓడించారు. అలానే లూసి సఫరోవాతో గెలిచి 2005 యూఎస్ ఓపెన్ లో గ్రాండ్ స్లాం టోర్నమెంట్ లో నాల్గవ రౌండుకు చేరిన మొదటి భారత మహిళగా నిలిచారు. 2003 ఆస్ట్రో ఆఫ్రికన్ గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలని సొంత చేసుకోవడము జరిగింది.
డోహా ఆసియా క్రీడల్లో మూడు పతకాలను గెలుచుకున్నారు. ఉమెన్స్ డబుల్స్ లో బంగారు పతకం, మహిళల సింగిల్స్ లో వెండి పతకాన్ని గెల్చుకున్నారు. 2006లో స్వెట్లనా కుజ్నెట్సోవా, నాడియా పెట్రోవా, మార్టినా హింగిస్ లపై వరుసగా 10 విజయాలు సాధించారు.
అదే విధంగా పాటియాలో జరిగిన 2007 ఆస్ట్రేలియా ఓపెన్ లో సెమీఫైనల్స్ కి ఆమె చేరడంతో పాటు, బెంగళూరు టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరి 2007ను మంచి విజయాలతో మొదలు పెట్టారు ఆమె. 2007 యూఎస్ ఓపెన్ సిరీస్ లో 8వ స్థానం దక్కించుకోవడంతో సానియా సింగిల్స్ లో ప్రపంచ 27వ నెంబర్ ర్యాంకు లో నిలిచారు.
2007 యూఎస్ ఓపెన్ లో అన్నా చక్వతడ్జే పై గెలిచి మూడోసారి మూడవ రౌండుకు చేరుకుని రికార్డు సృష్టించారు. అలానే డబుల్స్ లో మహేష్ భూపతి తో కలసి క్వార్టర్ ఫైనల్స్, మహిళల డబుల్స్ లో బెతనే మాటెక్ తో కలసి ఆడి క్వార్టర్ ఫైనల్స్ కి సానియా చేరారు. 2007లో నాలుగు డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు సానియా.
అక్టోబరులో 2010 కామన్ వెల్స్ ఆటల్లో భారత్ తరఫున ఆడిన సానియా బ్రిటానీ టీయి (కూక్ దీవులు), మరీన ఎరెకోవిక్ (న్యూజిలాండ్), ఓలివియా (ఆస్ట్రేలియా) లను ఓడించి ఫైనల్స్ కు చేరారు. ఫైనల్స్ లో ఆమె రన్నర్ గా నిలిచారు.
నవంబరులో 2010 ఏషియన్ గేమ్స్ లో భారత్ తరఫున ఆడారు సానియా. మొదటి రౌండులో చాన్ వింగ్ యాయును, జాంగ్ షుయాయ్ లను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. ఇలా దీనిలో ఆమె కాంస్యం సాధించారు.
ఆగస్టు 2016 మార్టినా హింగిస్ మరియు సానియా టీమ్ విడిపోవాలని అనుకున్నారు. కానీ వాళ్ళు మంచి స్నేహితులే ఇంకా. ఆ తర్వాత మార్టినా హింగిస్ కి కమిటెడ్ పార్ట్నర్ కోసం కష్టపడింది.
2016 లో సానియా 100 Influential people లిస్ట్ లో వుంది.
అక్టోబర్ 2018 సానియా ఇజ్హాన్ కి జన్మించ్చింది.
జనవరి 2020 42 వ WTA డబుల్స్ టైటిల్ ని హోబార్త్ ఇంటెర్నేషన్ లో పొందింది.
జులై 2021 UAE అఫీషియల్ గా సానియాకి దుబాయ్ గోల్డెన్ వీసాని ఇచ్చింది. షారుఖ్ ఖాన్,సంజయ్ దత్ తర్వాత దుబాయ్ గోల్డెన్ వీసాని పొందిన ఇండియన్ సానియానే.
డిసెంబరులో, దుబాయ్ ఆల్ హబ్టూర్ టెన్నిస్ ఛాలెంజ్ లో క్సెనియా పెర్వక్, జులియా జార్జస్, ఎవ్జెనియా రోడినా, బోజానా జొవెనొస్కిలను ఓడించి టోర్నమెంట్ గెలుచుకున్నారు సానియా. ఇలా సానియా ఎన్నో గెలుపోటములని తన కెరీర్ లో చూడడం జరిగింది.
సానియా మీర్జా అందుకున్న అతి పెద్ద విజయాలు, అవార్డులు, రికార్డులు:
భారత అథ్లెట్ సానియా మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో 14 పతకాలు సాధించింది. వీటిలో ఆరు బంగారు పతకాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మీర్జా ఏ ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించలేదు. అందుకే 2020 టోక్యో క్రీడలను లక్ష్యంగా చేసుకుంది.
సానియాని 2004 లో అర్జున అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆ తరువాత 2006 లో పద్మశ్రీని పొందింది. 2015 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. 2016 లో పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకుంది.
సానియా ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను రెండు సార్లు గెలుచుకుంది. డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక మహిళా భారతీయ క్రీడాకారిణి కూడా సోనియానే.
మహేష్ భూపతి, సానియా మీర్జా 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచారు. వీరు 2012 లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి వారి రెండవ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. బ్రూనో సోరెస్‌తో 2014 యుఎస్ ఓపెన్‌ను గెలుచుకోవడం ద్వారా సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది.
సానియా మీర్జా మరియు మార్టినా హింగిస్ 2015 వింబుల్డన్ మరియు 2015 యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నారు. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయంతో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.