ముంబై మునుగుతుంటే.. హాయిగా మందేసి చిందులేస్తున్నారు

-

ముంబై మహానగరంలో వర్షాలు విపరీతంగా కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబై వీధులు మొత్తం నీళ్లతో నిండిపోయాయి. చాలా అపార్ట్మెంట్లలోకి కూడా… వరద నీరు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మందుబాబులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటుంది.

mumbai
mumbai

ముంబై నగరం మొత్తం మునుగుతుంటే ఈ ఇద్దరు మందుబాబులు మాత్రం వరద నీటిలోనే మందు తాగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. ముంబై నగరం మొత్తం మునిగిపోతుంటే మీరు మందేసి చిందేస్తున్నారు కదరా అని అంటున్నారు.

ఇక అటు మహారాష్ట్రలో గత కొద్ది రోజుల నుంచి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరం అల్లకల్లోలంలో పడింది. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాందేడ్ లలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక నాందేడ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. ముంబై మహానగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దీంతో రోడ్డుపైన వెళ్లే రహదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news