అర్జున చెట్టు గురించి విన్నారా? ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందిన ఈ చెట్టు బెరడు తెలుపు-ఎరుపు రంగులో ఉండి, అనేక ఆయుర్వేద మందుల్లో ఉపయోగించబడుతుంది. హై బ్లడ్ ప్రెషర్ (బిపి) ఈరోజుల్లో సర్వసాధారణ సమస్య. దీనికి ప్రకృతి సిద్ధంగా ఉన్న అర్జున బెరడు అద్భుతమైన పరిష్కారం. ఆయుర్వేదంలో దశాబ్దాలుగా వాడుకలో ఉన్న ఈ చెట్టు బెరడు గుండె ఆరోగ్యాన్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. మరి ఈ ఔషధాన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం..
అర్జున బెరడు యాంటీ ఆక్సిడెంట్లు,ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి రక్తనాళాలను రిలాక్స్ చేసి బీపీని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటం లో, రక్త ప్రసరణ మెరుగుపరచటం లో సహాయపడుతుంది.
ఎముకలు బలహీనంగా ఉన్నవారికి అర్జున బెరడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని పొడి చేసి తేనెతో కలిపి రోజూ పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎముకలకు దృఢత్వం వస్తుంది.
ఈరోజు లలో హార్ట్ ప్రాబ్లెమ్ ఎక్కువగా చూస్తున్నాం.చిన్న,పెద్ద తేడ లేకుండా ఈ సమస్య వేధిస్తుంది.ఇలాంటి సమస్య రాకుండ ప్రతిరోజు అర్జున బెరడు కషాయం తీసుకోవడం గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది ధమనులు, సిరల్లో రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చేసి గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది. అదేవిధంగా, అధిక కొలెస్ట్రాల్‌పై కూడా నియంత్రణ కలిగిస్తుంది.

అర్జున్ టీ తయారీ : అర్జున బెరడు పొడిని ఒక టీ స్పూన్ తీసుకొని రెండు కప్పుల నీటిలో వేసి10 నిమిషాలు మరిగించండి. వడకట్టి తేనె, నిమ్మరసం రుచి కోసం యాడ్ చేసుకుని తాగండి. రోజు ఉదయం టీ తాగితే బీపీ క్రమంగా కంట్రోల్ అవుతుంది.
ఆరోగ్య రక్షణ కోసం అర్జున బెరడుతో పాటు పండ్లు, కూరగాయలు, తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ వాడకం ప్రారంభించే ముందు ఆయుర్వేద నిపుణుడి సలహా అవసరం. ముఖ్యంగా రక్తపోటు మందులు తీసుకుంటున్న వారు వైద్యుడి మార్గదర్శకత్వంలో మాత్రమే దీనిని ఉపయోగించాలి.
(గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే,ఏదయినా సమస్య వుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.)