జమ్మూలో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం

-

జమ్మూ కశ్మీర్‌ లో ని మాచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మచిల్‌ కుప్వారాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం, కోమన్‌పల్లికి చెందిన ర్యాడ మహేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. మహేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈయన రెండేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన సుహాసినితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇక మరో సైనికుడు ఏపీలోని చిత్తూరు జిల్లాకి చెందిన వారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి ప్రస్తుతం హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక వీరిద్దరూ మరణించినట్టు వీరి కుటుంబాలకు సమచారం ఇచ్చారు ఆర్మీ అధికారులు. ఇక ఇద్దరు జవాన్ల వీర మరణంతో ఇరు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version