డయాబెటిస్‌ మెడిసిన్‌ మెట్‌ఫార్మిన్‌.. కోవిడ్‌ చికిత్సకు వండర్‌ డ్రగ్‌..

-

టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధితో బాధపడుతున్న వారే కాక ప్రీ డయాబెటిస్‌ లక్షణాలు ఉన్నవారు ప్రస్తుతం అనేక మంది డాక్టర్లు సూచించే మెట్‌ఫార్మిన్‌ మెడిసిన్‌ను వాడుతున్నారు. ఇది డయాబెటిస్‌ పేషెంట్లలో షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీన్ని పీసీవోడీ సమస్య ఉన్న మహిళలు, షుగర్‌ లేకుండా స్థూలకాయంతో బాధపడేవారికి బరువు తగ్గేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడిదే మెట్‌ఫార్మిన్‌ మెడిసిన్‌ కోవిడ్‌ చికిత్స కూడా ఉపయోగపడుతుందని తేల్చారు. ఈ మేరకు చైనా డాక్టర్లు మెట్‌ఫార్మిన్‌ మందును కోవిడ్‌ చికిత్సకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది.

type 2 diabetes medicine metformin wonder drug in treating covid 19

మెట్‌ఫార్మిన్‌ మెడిసిన్‌ ఖరీదు చాలా తక్కువ. ఈ మెడిసిన్‌ జనరిక్‌ డ్రగ్‌ అయితే ఒక్క ట్యాబ్లెట్‌ కేవలం 3 పైసల ధర మాత్రమే ఉంటుంది. అందువల్ల పేద దేశాలు కూడా మెట్‌ఫార్మిన్‌ను కోవిడ్‌ చికిత్సకు పెద్ద ఎత్తున ఉపయోగించవచ్చు. వూహాన్‌లో వైద్యులు మెట్‌ఫార్మిన్‌ను కోవిడ్‌ 19 పేషెంట్ల చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. కోవిడ్‌ వల్ల శరీరంలో వచ్చే వాపులను మెట్‌ఫార్మిన్‌ తగ్గిస్తుందని వెల్లడైంది. అంతేకాదు.. దీని వల్ల కోవిడ్‌ పేషెంట్లు మరణించే శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందని తేల్చారు.

కాగా వూహాన్‌లోని సైంటిస్టులతోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా పరిశోధకులు మెట్‌ఫార్మిన్‌పై పరిశోధనలు చేశారు. ఈ మెడిసిన్‌ను కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించవచ్చని అంటున్నారు. దీని వల్ల కోవిడ్‌ పేషెంట్లు మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే మెట్‌ఫార్మిన్‌ను నిజానికి ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తున్నారు. కొందరు వైద్యులు దీన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సకు వాడుతున్నారు. ఇక వయస్సు మీద పడడం కారణంగా వృద్ధులకు వచ్చే సమస్యల కోసం కూడా మెట్‌ఫార్మిన్‌ను పలు వైద్యులు సూచిస్తున్నారు.

అయితే మెట్‌ఫార్మిన్‌ మాత్రమే కాకుండా.. మరో తక్కువ ఖరీదు ఉన్న డ్రగ్‌ అయిన డెక్సామిథసోన్‌ను కూడా కోవిడ్‌ చికిత్సకు వాడవచ్చని ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది. డెక్సామిథసోన్‌ ఒక స్టెరాయిడ్‌ డ్రగ్‌. మెట్‌ఫార్మిన్‌లాగే ఇది కూడా చాలా తక్కువ ఖరీదు ఉంటుంది. ఇది వెంటిలేటర్‌పై చికిత్స పొందే కోవిడ్‌ పేషెంట్ల మరణాలను 1/3వ వంతు వరకు తగ్గిస్తుంది. అలాగే ఆక్సిజన్‌ సపోర్ట్‌పై చికిత్స తీసుకునే కోవిడ్‌ పేషెంట్ల మరణాలను 1/5వ వంతు వరకు తగ్గిస్తుంది.

అయితే టైప్‌ 2 డయాబెటిస్‌ చికిత్సకు ఉపయోగించే మెట్‌ఫార్మిన్‌ను ప్రస్తుతం సైంటిస్టులు వండర్‌ డ్రగ్‌ అని పిలుస్తారు. ఈ డ్రగ్‌ను తీసుకునే డయాబెటిస్‌ పేషెంట్లు కోవిడ్‌ కారణంగా చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేల్చారు. అయితే మెట్‌ఫార్మిన్‌ గురించిన ఈ విషయం ఇప్పుడే తెలిసినందున భారత ప్రభుత్వం దీన్ని కోవిడ్‌ చికిత్సకు అనుమతించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. కోవిడ్‌ బారిన పడే డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో ఊరటనిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news