అబుదాబి ఎయిర్ పోర్ట్ పై ఉగ్రదాడి… ఇద్దరు భారతీయుల మృతి

-

యూఏఈ అబుదాబి ఎయిర్ పోర్ట్ పై ఉగ్రదాడి జరిగింది. యెమెన్ కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. బాంబుల్లో ఒకటి విమానశ్రయం ప్రధాన ప్రాంతంలో పేలుడు జరగ్గా.. మరో చోట 3 ఆయిల్ ట్యాంకర్ల పేలిపోయాయి. డ్రోన్ల ద్వారా ఈ ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు భారతీయుల మృతి చెందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యెమెన్ లోని హౌతి తిరుగుబాటుదారులకు మధ్య గతం నుంచి ఘర్షణ కొనసాగుతోంది. ఎయిర్ పోర్ట్ లో రెండు డ్రోన్లతో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుపై అబుదాబి పోలీసులు అలెర్ట్ అయ్యారు. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారణమైన డ్రోన్ల విడి భాగాలను కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. గతంలో కూడా ఇలాగే యూఏఈ పై ఉగ్రదాడులు జరిగాయి. 2019 సెప్టెంబర్ లో కూడా ఇదే రకంగా దాడులు జరిగాయి. ఆ సమయంలో చమురు స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. యెమెన్ లో హౌతీ తిరుగుబాటు దారులకు, ప్రభుత్వ దళాలకు మధ్య ఎప్పటి నుంచో ఘర్షణ వాతావరణం నెలకొంది. యెమెన్ దేశంలో ప్రభుత్వదళాలకు యూఏఈ, సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడంతో హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version