సినీ హీరో అల్లరి నరేష్ ఈ మధ్య నాంది సినిమాతో మంచి టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు అదే సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి ఇప్పుడు `ఉగ్రం` చేశాడు. ఇది నేడు(మే5న)శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. దాంతో సినిమా ఎలావుంటుందో అని చాలాల మంది వెయిట్ చేస్తున్నారు.. తాజాగా విడుదలైన ఈ సినిమా టాక్ ఎలా ఉందో, పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం..
అల్లరి నరేష్ అంటేకామెడీకి కేరాఫ్. కామెడీ చిత్రాలతో హీరోగా ఎదిగి నవ్వులు పూయించిన ఆయనకి ఇప్పుడు ఆ కామెడీనే వర్కౌట్ కావడం లేదు. అందుకే ఆయన తనని తాను మార్చుకోవాల్సి వచ్చింది. సీరియస్ లుక్‌లోకి టర్న్ తీసుకుని చేసిన `నాంది` భారీ విజయాన్ని సాధించింది. అల్లరి నరేష్‌ని కొత్తగా ఆవిష్కరించింది. విజయ్ కనకమేడల ఆయనకు మంచి విజయాన్ని అందించారు. అల్లరి నరేష్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత చేసిన `మారెడుమిల్లి నియోజకవర్గం` పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి `నాంది` డైరెక్టర్ విజయ్ కనకమేడలతో కలిసి ఇప్పుడు `ఉగ్రం` చేశాడు. ఇది నేడు(మే5న)శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు..
కథ విషయానికొస్తే..ఈ సినిమా కథ ఒక సస్పెన్స్ థ్రిల్లర్..మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో అల్లరి నరేష్.. శివకుమార్ అనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. సినిమా కథగా బాగుందట. మిస్టరీ థ్రిల్లర్‌ని ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్.. హీరో పాత్రను హైలెట్ చేస్తూ సినిమాను నడిపించాడు.. ఎందుకు ఎలా అనే సస్పెన్స్ తో సినిమాను తెరకేక్కించాడు..అయితే సినిమాలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్లు జోడించడంతో కథ ట్రాక్ తప్పినట్టుగా ఉందని పబ్లిక్ టాక్.. కథ కొంచెం చప్పగా, జనాలకు బోర్ కొట్టించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఫస్టాఫ్ లో ప్రారంభంలో కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైందట. కానీ రొమాంటిక్ ట్రాక్ చాలా డల్‌గా ఉందని, ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. దీనికితోడు బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సీన్లు వర్కౌట్ కాలేదని, అవి కన్విన్సింగ్‌గా లేవని అంటున్నారు. సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ అవుతుందట. శృతి మించిన యాక్షన్ సీన్లు ఉన్నాయట, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా లేదని అంటున్నారు. టైమ్ పాస్ మూవీ లాంటిది తప్ప, ఏదో ఆశిస్తే మాత్రం డిస్పాయింట్ అవ్వాలని జనాలు చెబుతున్నారు..
సినిమాకు క్లైమాక్స్ సీన్స్ హైలెట్ అయ్యాయి.. నరేష్ ఉగ్రరూపం చూపించాడు..కానీ మాస్ సీన్లకి ఆయన డైలాగ్ డెలివరీ సింక్ కాలేదని, మాస్ అప్పీల్ రాలేదంటున్నారు. హీరోయిజానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారట, అది కథని దెబ్బతీసేలా ఉంటుందంటున్నారు. బీజీఎం ఉన్నంతలో బాగుందట. ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయని, చాలా సీన్లు తీసేశారని కూడా సినీ వర్గాల్లో వినిపిస్తుంది.. ఇకపోతే ఈ సినిమాలో నటించిన వారికి పెద్దగా పేరు లేదు.. హీరోయిన్ తో సీన్లు తక్కువగా ఉండటం సినిమాకు మైనస్ అయ్యింది.. కథనం, లవ్ అండ్‌రొమాంటిక్ ట్రాక్, కొన్ని బోరింగ్ సీన్లు మైనస్ అంటున్నారు. హీరోయిజం ఎలివేషన్ ప్రయత్నం, నరేష్ డైలాగ్ డెలివరీ పెద్దగా ఆకట్టుకునేలా లేవంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకి యావరేజ్ టాక్ వినిపిస్తుంది.. మరి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.. ఏది ఏమైనా సినిమా యూనిట్ కి నిరాశ మిగిలిందని టాక్ వినిపిస్తుంది.. చివరగా మెసేజ్ ను ఇచ్చారు.. ఒక్కసారి చూడొచ్చు..
రేటింగ్ :2/5