రామబాణం ట్విట్టర్ రివ్యూ.. బాణం దిగిందా..?

-

శ్రీవాస్ దర్శకత్వంలో డింపుల్ హయతి హీరోయిన్గా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం రామబాణం.. ఈరోజు మే 5న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల అయింది.. ఇకపోతే ఈ సినిమాపై నెటిజన్ల రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం రామబాణం.. ఇదివరకు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లాగా నటించిన గోపీచంద్, జగపతిబాబు మరొకసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించినట్లు తెలుస్తోంది.. హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో రామబాణం సినిమా ప్రివ్యూ షో లు పడ్డాయి. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రొటీన్ కథ అయినప్పటికీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయని ఎమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని ఆడియన్స్ చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని కూడా సమాచారం.

రామబాణం సినిమాలో జగపతిబాబు ,గోపీచంద్ మద్య అన్నదమ్ముల బంధం చాలా బాగా చూపించారని.. ఇందులో జగపతిబాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెబుతూ ఉంటాడు. ఈ సినిమా అంతా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే.. హీరోయిన్ డింపుల్ ఇందులో యూట్యూబర్గా తన అందం , నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయిందని కొంతమంది చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ డింపుల్ తో రొమాన్స్,కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలిచిందని ట్విట్టర్ ద్వారా నెటిజన్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొత్తానికైతే గోపీచంద్ ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే రామబాణం సినిమాతో బాణం దింపేశాడు గోపీచంద్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఖుష్బూ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version