తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఊహ అనతికాలంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఈమె ప్రముఖ నటుడు అలాగే విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.. గతంలో శ్రీకాంత్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మరెన్నో ప్రేమకథా చిత్రాలలో నటించి లవర్ బాయ్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఊహ తో కలిసి నటించిన ఈయన అలా ఆమెతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకున్నారు.ఆమె సినిమా తో వీరు మొదటి సారి కలిసి నటించడం జరిగింది.
ఇక ఈ సినిమా తరువాత ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించింది. అయితే ఊహ సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది కానీ ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ కి హాజరైన ఊహ మరి ఎన్నో విషయాలను అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి కూడా తెలిపింది. ఊహ మాట్లాడుతూ వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం పిల్లలు , బాధ్యత అని మాత్రమే అని ఆమె తెలిపింది. ప్రస్తుతం తనకు తన పిల్లల భవిష్యత్తు, వారి ఎదుగుదల ముఖ్యమని, అందుకే తాను ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాను అని కూడా తెలిపింది.
తనకు ఒక కోరిక ఉంది అంటూ ఆ కోరికను కూడా బయటపెట్టింది ఊహ. ఎప్పటికైనా సరే తన కొడుకు రోషన్ హీరోగా ఆయనకు తల్లి పాత్రలో నటించే అవకాశం వస్తే .. తప్పకుండా తన భర్త శ్రీకాంత్తో కలిసి రోషన్ కి తల్లిదండ్రుల పాత్రలో నటించాలనే కోరిక ఉంది అని ఈ సందర్భంగా తన కోరికను బయటపెట్టింది. మరి ఈమె కోరికను ఏ దర్శకుడు నిజం చేస్తాడో తెలియాల్సి ఉంది.