UIDAI నుంచి ముఖ్యమైన సలహా… ఆధార్ వున్నవాళ్లు చూడండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు తప్పక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని చూసుకుంటూ ఉండాలి. తాజాగా ఒక ముఖాయమైన సలహా ఇచ్చారు. మరి ఇక దాని గురించి చూస్తే.. ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా అంతా ఉపయోగిస్తున్నారు.

ఎన్నో వాటికి ఆధార్ కచ్చితంగా ఉండాలి. అయితే చాలా మంది ఎక్కువగా ఇ-ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుంటూ వుంటారు. ఇ-ఆధార్ కార్డ్ ని ఎక్కడపడితే అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే రిస్క్ ఉంటుంది. మీకు నచ్చినట్టు ఏ ఇంటర్నెట్ సెంటర్ లో పడితే ఆ ఇంటర్నెట్ సెంటర్ ని డౌన్లోడ్ చేసుకోకండి. పబ్లిక్ కంప్యూటర్‌లో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేస్తే తప్పనిసరిగా దాన్ని డిలీట్ చేయండి.

యూఐడీఏఐ ఏ ఇలా చెబుతోంది. లేదంటే ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం కన్నా మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చెయ్యడం మంచిది. మాస్క్‌డ్ ఆధార్‌లో వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉంటుంది. ఆ వివరాలను చూపించారు. కనుక అలా చెయ్యడమే బెస్ట్. మాస్క్డ్ ఆధార్ లో మొదటి 8 అంకెలు హైడ్ అయ్యి ఉంటాయి. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఎలా ఈ ఆధార్ ని డౌన్లోడ్ చెయ్యచ్చనేది కూడా చూద్దాం.

https://eaadhaar.uidai.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయండి.
ఆధార్ నెంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి.
మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
తరవాత మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
క్యాప్చా కోడ్ కొట్టి.. Send OTP పైన క్లిక్ చేయండి.
డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version